PEN POWER
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 6:59 am Posted By : D Ratnam

ఆలయ ప్రాంగణంలో మత్తు వీరులు హల్చల్.

తిరుపతి క్రైమ్ బ్యూరో, పెన్ పవర్, మే 16.

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో గంజాయి మత్తులో వ్యక్తులు హల్చల్ చేశారు. గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు పెద్ద కర్రతో ఆలయం ముందు నానా హంగామా సృష్టించి భక్తులను బేంబే లెత్తించారు.దర్శనం కోసం వచ్చిన భక్తులను, స్థానికులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. దీంతో భక్తులు తీవ్ర ఆందోళన చెందారు. అక్కడ ఉన్న టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే గంజాయి బ్యాచ్ సెక్యూరిటీ సిబ్బందిపై తిరగబడి ఎదిరించారు. పవిత్రమైన ఆలయ పరిసరాల్లో ఇలాంటి ఘటనలు జరగడంపై భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.