గూడెం కొత్త వీధి,పెన్ పవర్,మే 9:జి.కె.వీధి మండలం దామనపల్లి పంచాయతీ ఎంపీటీసీ సభ్యుడు కొర్ర భీమరాజు పార్థివదేహానికి పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు శ్రద్ధాంజలి ఘటించారు. భీమవరం గ్రామంలో జరిగిన అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే పార్థివదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. భీమరాజు పార్టీకి చేసిన సేవలు మరువలేమని, కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.