
రోగులకు ఇబ్బందులు కలిగితే సహించబోమని హెచ్చరిక
ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కీలక ఆదేశాలు
విశాఖ దక్షిణం పెన్ పవర్, మే 12 :
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన, పారద ర్శక వైద్య సేవలు అందించేందుకు ప్రతి స్థాయిలో బాధ్యతాయుత వ్యవస్థ అవసరమని విశాఖపట్నం ఎంపీ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ తో కలిసి ఆంధ్ర వైద్య కళాశాలలో నిర్వహించిన కేజీహెచ్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం లో ఆయన పలు కీలక సూచనలు చేశారు.సమావేశానికి ముందు ఎం.పీ. భరత్ కేజీహెచ్ లోని ఓపీ విభాగాలు, స్త్రీల వ్యాధులు మరియు ప్రసూతి విభాగం, పిల్లల ఓపీ, టాయిలెట్లు, ఫిజి యోథెరపీ, ఆర్థోపెడిక్ వార్డు, హెచ్‌ఎంపీవీ ఐసో లేషన్ వార్డు, ఆల్కహాల్ డీ-అడిక్షన్ సెంటర్, ల్యాబ్ లు, పిల్లల వార్డులు, రాజేంద్రప్ర సాద్ వార్డులను పరిశీలించారు. అక్కడ రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.ఆసుపత్రిలో సిబ్బంది కొరత, పర్య వేక్షణ లోపం కారణంగా రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్, ల్యాబ్ పరీక్షలలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొన్ని వార్డుల్లో ఇద్దరు రోగులు ఒకే పడ కను వినియోగిస్తున్న పరిస్థితులు కనిపిస్తుండగా, మరికొన్ని విభాగాల్లో పడకలు ఖాళీగా ఉండటం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు.అత్యవసర విభా గాల్లో సౌకర్యాల విస్తరణ, ఎయిర్ కండీషనింగ్ సమ స్యల పరిష్కారం, మరుగుదొడ్ల నిర్వహణ, స్ట్రెచర్లు, పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పేద రోగు లకు ఆసుపత్రి వ్యవస్థపై సరైన మార్గదర్శకత్వం లేక ఇబ్బందులు ఎదురవు తున్నాయని పేర్కొం టూ, ఉచితంగా అందాల్సిన మందులు లేదా ఇ తర సామగ్రి స్టాక్‌లో లేక బయట కొనాల్సిన పరి స్థితులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఆసుపత్రిలో కొంతమంది సిబ్బంది, అవుట్‌సో ర్సింగ్ ఉద్యోగులు అక్రమ వసూళ్లకు పాల్పడు తున్నారన్న ఆరోపణలపై ఎం.పీ తీవ్రంగా స్పం దించారు. మృతదే హాల తరలింపు, పోస్టుమార్టం సేవల కోసం డబ్బులు డిమాండ్ చేయడం సహించబోమని హెచ్చరించారు. “ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే సేవలు పూర్తిగా ఉచితం. ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి” అని ప్రజలకుసూచించారు. “ప్రజలకు మంచి అనుభవం కల్పిం చడం కూడా వైద్య సేవలలో భాగమే. అందు బాటులో ఉన్న సిబ్బందిని సమర్థంగా వినియోగిస్తూ అవసరానికి అనుగుణంగా పునర్విభజన చేయాలి” అని అధికా రులకు సూచించారు. అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బం దిని ప్రోత్సహించడంతో పాటు బాధ్యతారాహి త్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ అభి షిక్త్ కిషోర్ మాట్లాడుతూ రోగులకు మార్గదర్శ కత్వం కల్పించేందుకు ఆసుపత్రి పరిధిలో ఎని మిది “మే ఐ హెల్ప్ యూ” డెస్కులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓపీ, ల్యాబ్‌లు మరియు ప్రధాన విభాగాల వద్ద నర్సిం గ్ విద్యార్థులు, భద్ర తా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బం దితో సహాయక వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పా రు. ఆసుపత్రి సేవలు పొందిన రోగులకు ఫాలోఅప్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకు నే విధానాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించా రు.కేజీహెచ్ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సా ధించడం గర్వకారణమని, భవిష్యత్తులో దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ ఆసుపత్రులలో ఒకటిగా నిలప డం లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నా రు.ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఫిర్యా దుల పరిష్కారం కోసం కంప్లైంట్ బాక్సులు, టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులపై వెంటనే విచారణ జరిపి ఇప్పటికే కొంతమంది అవుట్‌సోర్సింగ్ సిబ్బందిపై సస్పెన్షన్, టర్మినేషన్ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.ఈ సమావేశంలో వంశీకృష్ణ శ్రీనివాస్ , ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతమ్మరాజు సుధాకర్, ఆంధ్ర వైద్య కళా శాల ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదే వి, వివిధ విభాగాల అధిపతులు, వైద్యులు పాల్గొన్నారు.