PEN POWER
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 8:26 pm Posted By : SIVA KUMAR LANKA

కేబుల్ వైర్ చోరీ కేసులో నలుగురు అరెస్ట్

నర్సీపట్నం, పెన్ పవర్:

నర్సీపట్నం మున్సిపాలిటీ షణ్ముఖ నగర్ లో జరిగిన వెయ్యి మీటర్ల కేబుల్ చోరీ కేసును పోలీసులు చేదించారు. మెయిల్ సోలార్ ఆఫీసులో వెయ్యి మీటర్ల కేబుల్ వైర్ దొంగిలించారన్న ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సిసి ఫుటేజ్ ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు ముద్దాయిలను గాజువాకలో పట్టుకుని చోరీ సొత్తును రికవరీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం సాయంత్రం టౌన్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పి పి. శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. ఈ కేసులో పాత నేరస్థుడు రౌతు మల్లేష్, వెంపాల సంతోష్ కుమార్, గుంటూరు కృష్ణమూర్తి, చొప్ప పవన్, చేతన నవీన్, సిన్నిబోదుల మహేష్ లపై కేసు నమోదు చేశారు. వీరిలో నవీన్ అనారోగ్య కారణంగా హాస్పటల్ కు తరలించగా, మహేష్ పరారీలో ఉన్నట్లు డిఎస్పి తెలిపారు. చోరీ కాబడిన సొత్తు మూడు లక్షల యాబై వేలు విలువ ఉంటుందని తెలిపారు. నేరస్తులను పట్టుకోవడంలో చురుకైన పాత్ర పోషించిన సిబ్బందిని ఎస్పి తుహిన్ సిన్హా ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు. నలుగురు ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచామన్నారు. ఈ మీడియా సమావేశంలో టౌన్ సిఐ షేక్ గపూర్, ఎస్సైలు ఉమామహేశ్వరరావు, రమేష్ లు పాల్గొన్నారు.