అడ్డతీగల సీఐ ఎం.గజేంద్ర కుమార్…
అడ్డతీగల ,పెన్ పవర్, మే 22; అడ్డతీగల సిఐగా బాధ్యతలు చేపట్టిన ఎం. గజేంద్ర కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సిఐ మాట్లాడుతూ గంజాయి సారాయి వంటి అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే ,కఠిన చర్యలు తప్పవు అని సిఐ హెచ్చరించారు. అడ్డతీగల పరిధిలో యువత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా అతివేగముగా వాహనాలు నడుపుతున్నారని తన దృష్టికి వచ్చినట్లు సిఐ తెలిపారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని ,లైసెన్సు, సి బుక్ లేని వాహనాలను తక్షణమే అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని సిఐ తెలిపారు. మండల కేంద్రంలో ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో ప్రతి ఒక్కరు నిబంధనలను పాటించాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని ఇచ్చి వారిపేర్లు గోప్యంగా ఉంచుతామని సిఐ గజేంద్ర విజ్ఞప్తి చేశారు.