PEN POWER
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 11:51 pm Posted By : YEDUKONDALU DADALA

గొల్లపాలెం మహానాడులో పసుపు సందడి

తెలుగు తమ్ముళ్లకు ఘన విందుతో చుండ్రు వీర్రాజు చౌదరి – తాడి రామారెడ్డి ఆకట్టింపు

టీడీపీకి కార్యకర్తలే బలం… రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం

కాజులూరు, పెన్‌పవర్‌, మే 27ః తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు కాజులూరు మండలంలో పసుపు పండుగను తలపించాయి. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోందని, పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తప్పకుండా న్యాయం జరుగుతుందని టీడీపీ సీనియర్ నాయకులు చుండ్రు వీర్రాజు చౌదరి పేర్కొన్నారు. కార్యకర్తకు ఎటువంటి కష్టం వచ్చినా పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం తిరుమల ఫంక్షన్ హాల్లో బుధవారం కూటమి నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ మహానాడు మహోత్సవానికి తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారమైన మహానాడు కార్యక్రమాన్ని భారీ ఎల్‌ఈడి స్క్రీన్లు, టీవీల ద్వారా వీక్షించేందుకు చుండ్రు వీర్రాజు చౌదరి, ప్రముఖ పారిశ్రామికవేత్త తాడి రామారెడ్డి (టీఎంఆర్‌) ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కార్యక్రమానికి ముందు చుండ్రు వీర్రాజు చౌదరి, టీడీపీ మండల అధ్యక్షులు చవ్వాకుల డాక్టర్ బాబు, సనపల ధనరాజు, సొసైటీ చైర్మన్ అంగర కృష్ణ తదితరులు పార్టీ జెండాను ఆవిష్కరించి, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే క్లస్టర్-8 ఆధ్వర్యంలో కోలంక కళ్యాణ మండపంలో వర్చువల్ విధానంలో నిర్వహించిన మహానాడులో కూడా తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
గొల్లపాలెం తిరుమల ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మినీ మహానాడులో చుండ్రు వీర్రాజు చౌదరి, తాడి రామారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక నాన్‌వెజ్ విందు ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ రకాల వంటకాలతో ఏర్పాటు చేసిన విందు కార్యకర్తలను ఆకట్టుకుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఒకేచోట కూర్చొని భోజనం చేస్తూ పరస్పరం ఆత్మీయంగా పలకరించుకోవడంతో ఫంక్షన్ హాల్ ప్రాంగణం మొత్తం పసుపుమయంగా మారి పండుగ వాతావరణం నెలకొంది.


అనంతరం కూటమి నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జీలు, సొసైటీ చైర్మన్‌లు, నీటి సంఘాల అధ్యక్షులు, మాజీ సర్పంచ్‌లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, డీసీలు పెద్ద సంఖ్యలో హాజరై మహానాడు కార్యక్రమాన్ని తిలకించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం కార్యక్రమానికి హాజరై స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. టీడీపీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలిచే పార్టీ అని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తించే ఏకైక పార్టీ తెలుగుదేశమేనని పేర్కొన్నారు.
రెండు రోజుల మహానాడు కార్యక్రమానికి భోజన ఏర్పాట్లన్నీ చుండ్రు వీర్రాజు చౌదరి, తాడి రామారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా, జనసేన యువనేత డాక్టర్ డేగల నాగేంద్ర తిరుమల ఫంక్షన్ హాల్‌ను ఎటువంటి అద్దె తీసుకోకుండా ఉచితంగా అందించడం విశేషమని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.ఈ కార్యక్రమంలో తోట కృష్ణ, దాసరి బాబులు, చందాల ఆదినారాయణ, కోట తాతబ్బాయి, చందాల మల్లిబాబు, దడాల నాగార్జున, ఎర్రంనీడి గోవిందు, మాజీ సర్పంచ్ పోతుల గనిరాజు, పోతురాజు భీమారావు, కొల్లి హనుమంతు చౌదరి, పలివెల రాజు, ఖండవల్లి శ్రీనివాసరావు, గొల్లపాలెం గ్రామ కమిటీ అధ్యక్షులు నక్కా శ్రీను, అత్తిలి వెంకటరమణ,వల్లు అర్జునరావు,పితాని లీలా శంకర్‌, పితాని సూరసేనుడు,మేడిశెట్టి పెద్ద,జల్లి సత్యనారాయణ, బళ్ల ఈశ్వరరావు, బొడ్డు మల్లేశ్‌,పంపన శ్రీను, వనుం వీరబ్రహ్మం,పేపకాయల బాబ్జీ, గోపాలరాజు, కొండ తదితర కూటమి నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.