PEN POWER
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 6:08 pm Posted By : YEDUKONDALU DADALA

గొల్లపాలెం హైస్కూల్ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్‌కు విశేష స్పందన

క్రీడాకారులకు ప్రోత్సాహంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సతీష్, క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హరీష్ సందర్శనం
కాజులూరు, పెన్ పవర్,మే15:

కాకినాడ జిల్లా గొల్లపాలెం హైస్కూల్‌లో మే 1వ తేదీ నుండి నిర్వహిస్తున్న సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్‌కు విశేష స్పందన లభిస్తోంది.సాఫ్ట్‌బాల్,వాలీబాల్,రైఫిల్ షూటింగ్ విభాగాల్లో యువ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్న ఈ శిబిరాన్ని కాకినాడ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వి.సతీష్ కుమార్,సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ మరియు తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు తలాటం హరీష్ సందర్శించి క్రీడాకారులను ప్రోత్సహించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో క్రీడా పరికరాలను శిబిరానికి అందజేశారు.అలాగే దాతల సహకారంతో ఏర్పాటు చేసిన పౌష్టికాహారాన్ని విద్యార్థులకు పంపిణీ చేశారు.క్రీడలతో పాటు ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని అతిథులు సూచించారు.ఇటీవల ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించి గ్రామానికి గర్వకారణమైన గొల్లపాలెం విద్యార్థిని పితాని రూపా సాయి శ్రీను ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు.

ఆమె సాధన గ్రామ యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు అభినందించారు.గ్రామ పెద్దలు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సతీష్ కుమార్ మరియు తలాటం హరీష్‌లను ఘనంగా సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు మరింత ప్రాధాన్యం కల్పించేందుకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శలపాక నీటి సంఘం అధ్యక్షులు తాడి రామారెడ్డి (టిఎంఆర్), సొసైటీ చైర్మన్ అంగర కృష్ణ, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ ముర్రే శివశంకర్,గ్రామ టీడీపీ అధ్యక్షులు నక్క శ్రీను, అంగర శ్రీను,టీడీపీ క్లస్టర్ ఇంచార్జి పలివెల రాజు,దీవెనమెడికల్స్ అధినేత వెంకన్నబాబు,అర్టోస్ చిన్న, పోతుల వీరబాబు,చిన్న డాక్టర్,ధరణి,నాగార్జున, సంజయ్,పీడీలు జి.సునీల్,ఇమ్మాన్యేల్, తనోజ్,మణికంఠ తదితరులు పాల్గొన్నారు.