PEN POWER
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 9:58 am Posted By : D Ratnam

ఘోర రోడ్డు ప్రమాదం

 

ఉపాధి హామీ కూలీలపై టిప్పర్ దూసుకెళ్లి నలుగురు మహిళలు మృతి

కాకినాడ, పెన్ పవర్, మే 16 :
తూర్పుగోదావరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

సమాచారం ప్రకారం, ఉపాధి హామీ పనులకు వచ్చిన కూలీల హాజరును ఫేస్ యాప్ ద్వారా నమోదు చేయడానికి ఫీల్డ్ అసిస్టెంట్ వారిని రోడ్డుపై ఒకేచోట నిలబెట్టిన సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వేగంగా వచ్చిన టిప్పర్ వాహనం కూలీలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మహిళలు మృతి చెందినట్లు సమాచారం.

కొంతమంది కూలీలు రోడ్డుపై నుంచి కిందకు దూకడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు