PEN POWER
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 10:30 pm Posted By : Sathish Bede

చింతూరు గ్రామంలో కుక్కల సమస్యపై దళిత నాయకుల ఆందోళన

చింతూరు, పెన్ పవర్, మే 2:

 

చింతూరు గ్రామంలో పెరుగుతున్న వీధి కుక్కల సమస్యపై దళిత నాయకులు నాగేంద్ర మరియు కుమార్ గ్రామపంచాయతీ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలోని బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ, వాడబజార్, సినిమా హాల్ సెంటర్, మెడికల్ కాలనీ తదితర ప్రాంతాల్లో వీధి కుక్కలు చిన్నపిల్లలు, పశువులు, కోళ్లు మరియు రహదారులపై వెళ్లే ప్రజలపై దాడులు చేస్తున్నాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ గ్రామ ప్రజల భద్రత కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కుమార్ మాట్లాడుతూ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వీధి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో పెరుగుతున్న ఈ సమస్యపై అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. అని వినతిపత్రం పంచాయితీ ఆఫీస్ లో సిబందికి సమర్పించారు.