కాజులూరు, పెన్ పవర్, మే 1:
గుండె సంబంధ వ్యాధికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న బంధనపూడి మాజీ సర్పంచ్, సీనియర్ రాజకీయ నాయకులు జక్కన రాజేష్ ను శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు శుక్రవారం సాయంత్రం పరామర్శించారు.వైయస్సార్సీపీ రాష్ట్రస్థాయి నాయకులైన తోట త్రిమూర్తులకు ముఖ్య అనుచరుడిగా ఉన్న జెక్కన రాజేష్‌ను ఆయన స్వగృహానికి వెళ్లి కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు.ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ, మండలంలో తనకు ఎంతో సన్నిహితులు ఉన్నారని, వారందరితో కుటుంబ సభ్యుడిలా కలిసి పనిచేశానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన యువనేత డాక్టర్ డేగల నాగేంద్ర, వైఎస్సార్సీపీ నాయకులు నల్లమిల్లి ఈశ్వర్ రెడ్డి, సూరంపూడి భాను, నున్న కాశి, జక్కన సత్యనారాయణ (విజయ్ బిర్యానీ) మాజీ సర్పంచ్ వడ్డీ వెంకటరమణమూర్తి,తలాటం సత్తిరాజు, వంగ రంగా తదితరులు పాల్గొన్నారు.