స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మే 30:గూడెం కొత్తవీధి మండలానికి చెందిన బత్తుల ల సిద్ధార్థ్ మార్క్ ని జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య తెలిపారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్నప్పటికీ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, ఇటీవల పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో పార్టీ నిబంధనల మేరకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.ఇకపై పార్టీ పేరు, జెండా, గుర్తులను ఉపయోగించరాదని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని సూచించారు.