PEN POWER
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 6:18 am Posted By : M CHANTI BABU

జీకే వీధిలో మినీ మహానాడు వేడుకలకు ఘన ఏర్పాట్లు

పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ పిలుపు

గూడెం కొత్త వీధి,పెన్ పవర్,మే 26:అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మినీ మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మండల అధ్యక్షులు పొత్తూరు కొండలరావు తెలిపారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా . చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ అధిష్టానం సూచనలతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జీకేవీధి మండల కేంద్రంలోని కళ్యాణ మండపంలో మే 27, 28 తేదీలలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజల కోసం అన్ని వసతులు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రెండు రోజుల పాటు ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం టీ సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీలు, అనుబంధ కమిటీలు, క్లస్టర్ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, బూత్ ఇంచార్జులు, కన్వీనర్లు, కో-కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు మరియు ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు పొత్తూరు కొండలరావు విజ్ఞప్తి చేశారు.