మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని అందుకు నిరసనగా జూన్ 1న పాడేరులో భారీ నిరసన ర్యాలీ, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ పాడేరు యువజన విభాగం అధ్యక్షులు లమ్మసింగి రమేష్ తెలిపారు.పాడేరు వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు,రేగం మత్యలింగం పాల్గొననున్నారని తెలిపారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.