అల్లూరి జిల్లా జీకేవీధి మండలం రింతాడ పంచాయతీ బొడ్డుమాను వీధికి చెందిన పాంగి రమణ–రూత్ దంపతుల సంవత్సరం ఏడు నెలల బాలుడు జస్వంత్ తలసేమియా మేజర్ వ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడికి ప్రతి 15 రోజులకు లేదా నెలకోసారి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.ఎన్టీఆర్ భరోసా మెడికల్ పెన్షన్ కోసం పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ మంజూరు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో వైద్య ఖర్చులు భరించడం కష్టంగా మారిందన్నారు.మాజీ ఉపసర్పంచ్ సోమేశ్ కుమార్ బాలుడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, ప్రభుత్వం వెంటనే స్పందించి మెడికల్ పెన్షన్ మంజూరు చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.