నర్సీపట్నం, పెన్ పవర్:
నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన సూర్యచంద్ర నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు వినతులు స్వీకరించారు. అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అధికంగా భూ సమస్యలు, విద్యుత్ తదితర సమస్యలపై 12 వినతులు వచ్చాయని తెలిపారు. వచ్చిన సమస్యలన్నిటిని సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారంలో జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు అల్లాడ సురేష్, పంచాడ హరినాథ్, నాతవరం ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు సూరిశేఖర్, సీనియర్ నాయకులు మంగళ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.