PEN POWER
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 6:40 pm Posted By : SIVA KUMAR LANKA

నర్సీపట్నంలో ప్రైవేట్ మహిళా జూనియర్ కళాశాల మంజూరు

నర్సీపట్నం, పెన్ పవర్ ( మే 31) :

మహిళల విద్యాభివృద్ధికి మరో ముందడుగుగా నర్సీపట్నంలో ఆదిత్య నూతన మహిళా జూనియర్ కళాశాల మంజూరు కావడంపై కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. కళాశాల మంజూరుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రత్యేక కృషి చేసిన చింతకాయల అయ్యన్నపాత్రుడుకు యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. నూతన మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థినులకు ఉన్నత విద్య మరింత చేరువ కానుందని యాజమాన్యం పేర్కొంది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో బాలికల విద్యాభ్యాసానికి ప్రోత్సాహం లభిస్తుందని తెలిపింది. ఈ కళాశాల మంజూరుతో నర్సీపట్నం విద్యా రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని, మహిళల సాధికారతకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ లగుడు హరిప్రసాద్, అయ్యన్నపాత్రుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులోనూ విద్యారంగ అభివృద్ధికి ఆయన సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు