PEN POWER
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 9:02 pm Posted By : K U FIROSE

పలుమార్లు మాస్టర్ ప్లాన్ మారుస్తూ రోడ్డు విస్తరణ పనులు

గాజువాక లో ఇంద్రుడుకి ఒక న్యాయం చంద్రుడుకి ఒక న్యాయం                                                  -నత్త నడకన బాల చెరువు రోడ్డు విస్తరణ పనులు
-చిరు మధ్యతరగతి వ్యాపార భక్తులకు గుది బండగా తయారైన వైనం
-కాంట్రాక్టర్లు అలసత్వం పనుల్లో జాప్యం
-మూడు నెలలైనా పూర్తిగా ని రోడ్డు విస్తరణ పనులు
విశాఖపట్నం  : పెన్ పవర్ ,మే 11 ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పనే ధ్యేయం అని చెప్పుకొనే ప్రభుత్వం పారదర్శకత లోపించిందని పలువురు తమ ఆసహాన్నాని బహిరంగం గా వెల్లడిస్తున్నారు బిల్డింగులు రోడ్డు తవ్వకాలు జరిపిన శ్రద్ధ రోడ్లు విస్తరణ పనులు పూర్తి చేయడంలో అలసత్వం చూపిస్తున్న కాంట్రాక్టర్లుఅధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ వారికి మద్దతు తెలుపుతున్నట్టుగా ఉంది . నాయకులకు ఫోన్ చేస్తూ తమ గోడు వెల్లబుచ్చు కొన్నదాము అంటే కనీసం ఫోన్ లో కూడా సమాధానం చెప్పని ధీన స్థితి లో ప్రజారంజక పాలన సాగుతుంది .రోడ్డు విస్తరణలో ప్రణాళిక బద్ధంగా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందిసమస్యాత్మక ప్రాంతంలో 30 అడుగులు విస్తరణ అని,సమస్యలేని ప్రాంతంలో విశాల ఉన్న చోట 36 అడుగులు తవ్వుకుంటూ బిల్డింగ్ తొలగించడానికి చర్యలు చేపడుతున్న తీరును పలువురు ఎండ కడుతున్నారు. తమ అనుచరులు, అనననీయులు, సామాజిక వర్గం , అభిమానులు భవనాలు , షాపులకు ఎటువంటి ప్రమాదం కలగకుండా మాస్టర్ ప్లాన్ అంటూ చెబుతూనే ఇష్టానుసారంగా కాలవల తవ్వకాల్లో పలు మార్పులు చేర్పులు చేస్తున్న తీరు ను పలువురు దుయ్యబడుతున్నారు.ఎవరు అడిగే వారు లేకపోవడంతో తమ ఇష్టారాజ్యంగా. వ్యవహరిస్తున్నారు.ఎవరికి వారు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్, సచివాలయం , రోడ్డు భవనాల శాఖ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుకు పలువురు తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఆలస్యం నెపం ఒక శాఖ  మీద ఒక శాఖ వేసుకొనడంతో ఎవరిని అడగాలో తెలియక దిక్కుతోచని స్థితిలో స్థానికులు ఉన్నారు . పనుల్లో పారదర్శకత లోపిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. కూటమి నాయకులు అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ప్రతి వీధుల్లో జరుగుతున్న పనుల్లోపర్యవేక్షిస్తున్నామని పలు పత్రికలో ప్రచరించు కోవడం అందరికీ తెలిసిన సంగతి విధితమే . కాంట్రాక్టర్ ని వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ,బీసీ రోడ్డు విస్తరణలో పనులు జరుగుతున్న మొదలు నేటి వరకు నాయకులు పత్తా లేకుండా ఉండడంతో ఇదే ఏమిటని పలువురు స్థానికులు నిలదీస్తున్నారు.అందరూ వ్యతిరేకిస్తున్నారు . చిరు మధ్యతరగతి వ్యాపారస్తుల పొట్ట కొట్టారని పలువురు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పనులు నత్తనడకన సాగడం ఏమిటని నినదీస్తున్నారు . ఆస్తి పన్నులు, వాణిజ్య పన్నులు నిర్ణీత గడువు తేదీల్లో కట్టకపోతే వడ్డీ మీద వడ్డీ వేసి చక్ర వడ్డీతో సహా కట్టించుకుంటున్న జీవీఎంసీ అధికారులు మౌలిక సదుపాయాల కల్పనలో అలసత్వం చూపడం ఏమిటని వ్యాఖ్యానిస్తున్నారు. రోడ్డు విస్తరణ మౌలిక సదుపాయాలు కలపనలో భాగంగా కాలవలు అంతా మంచికైనప్పటికీ నిర్ణీత సమయంలో పూర్తి చేయకపోవడంతో అటు వ్యాపారస్తులు ,స్థానికులు ,వాహన ఛోధకులు , పాదచారులు ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతున్న పట్టించుకోవడం లేదని, తమ మొర ఎవరికి విన్నవించాలో తెలియడం లేదన్నారు. రోడ్డు మెయిన్ రోడ్ జంక్షన్ లో రోడ్డు గురించి పోవడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు పాదచారులు నరకం అనుభవిస్తున్న ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తూ ప్రజా ప్రతినిధులు అధికారులు రోడ్డు విస్తరణకు చర్యలు చేపట్టకుండా నిమ్మలంగా ఉండడం పలు అనుమానాలకు పలు సందేహాలకు తావిస్తోంది. రోడ్డు విశాలంగా ఉన్న ప్రాంతంలో మాత్రం మాస్టర్ ప్లాన్ అను నెపంతో విస్తరణలో 36 అడుగులు తీసుకోవడం వెనక ఉద్దేశం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. మెయిన్ జంక్షన్లో 30 అడుగులు 32 అడుగులు అంటూ పలుమార్లు మారుస్తూ అందరిని అయోమయానికి గురి చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా రోడ్డు విస్తరణలు అంతట ఒక ప్రణాళిక బద్ధంగా జరగాలి గాని ఏరియా వైస్ గా మార్చడం ఏమిటని దీని వెనుక ఉన్న లోగుట్టు పెరుమాలికే ఎరుకని తమ అనుమానాలను స్థానికులు వెల్లపుచ్చుతున్నారు బీసీ రోడ్డు 36 అడుగులు విస్తరణ భాగంగా అంతటా తీసుకుంటే అందరికీ సమన్యాయం చేసిన వారు అవుతారని పలువురు తమ అభ్యంతరాలను తెలియజేస్తున్నారు.చేస్తూ పనులు సక్రమంగా లేకపోవడంతో అసహనంతో అందరూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు ఎన్నికైన తర్వాత అందరిని సమభావంతో చూడాలని గాని ఇంద్రుడుకో న్యాయం చంద్రుడికో న్యాయం అన్న తరహాలో పనులు చేపట్టడం ఏమిటది అని పలువురు అభ్యుదయవాదులు నిలదీస్తున్నారు. అధికారం పలుకుబడి సామాజిక వర్గం పేరుతో పలువురు భవనాలకు వ్యాపార సముదాయాలకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రజాప్రతినిధులే కొమ్ముకాస్తున్నారు అని బహిరంగ విమర్శ ఉండనే ఉంది.వ్యవహారం పై నిజనిర్దారణ చేయాలని జిల్లా ఉన్నత అధికారులను కోరుతున్నారు .