PEN POWER
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 1:31 pm Posted By : M CHANTI BABU

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి : బొబ్బిలి లక్ష్మణ్

  • గూడెం కొత్త వీధి, పెన్ పవర్, మే 18: దేశంలో   పెరుగుతున్న  పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగ కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్ అన్నారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే ఇంధన ధరలు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.