PEN POWER
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 12:03 pm Posted By : SIVA KUMAR LANKA

పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై సిపిఎం ఆందోళన

నర్సీపట్నం, పెన్ పవర్:

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై 3/- పెంచడానికి వ్యతిరేకిస్తూ సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. నర్సీపట్నంలో జిసిసి పెట్రోల్ బంక్ వద్ద ఆటోకి తాడు కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు మాట్లాడుతూ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పాండిచ్చేరి ఎన్నికల పలితాలు వచ్చిన పది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం దారుణం అన్నారు. ధరలు పెంచే ఉద్దేశంతోనే ప్రధాని మోడీ ముందుగా పొదుపు పేరుతో ప్రజలకు ఉచిత సలహాలు ఇచ్చారన్నారు. చమురు ధరలు పెంచడం అంటే ప్రజలను మరింత దరిద్రంలోకి నెట్టడమే అన్నారు. ఇప్పటికే ఉచిత బస్ తో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు, ధరలు పెరుగుదల పిడుగుపాటు వంటిదన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.