PEN POWER
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 6:31 pm Posted By : D Ratnam

పోలవరం జిల్లా డేటా ఎంట్రీ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు రెడ్డి

 

గంగవరం, మే 4: పోలవరం జిల్లాలోని రెవిన్యూ డేటా ఎంట్రీ ఆపరేటర్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో గంగవరం మండలం రెవిన్యూ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా సేవలందిస్తున్న కె. వెంకటేశ్వర్లు రెడ్డి ని సంఘం జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అలాగే సంఘ కార్యదర్శిగా వి.ఎస్. సత్యనారాయణ, కోశాధికారిగా ఎ. విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన నాయకత్వ బృందాన్ని సంఘ సభ్యులు హర్షధ్వానాలతో అభినందించారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కె. వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించడం, వారి హక్కులను కాపాడటం, వేతనాలు మరియు ఉద్యోగ భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. అన్ని మండలాల ఆపరేటర్లతో సమన్వయం కలిగి సంఘాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.సంఘం కార్యదర్శి వి.ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ, సభ్యుల సంక్షేమం కోసం వివిధ కార్యక్రమాలను చేపడతామని, ప్రభుత్వంతో సమన్వయం ద్వారా ఉద్యోగులకు అనుకూల నిర్ణయాలు తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. కోశాధికారి ఎ. విజయ్ కుమార్ కూడా సంఘ ఆర్థిక వ్యవహారాలను పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడించారు.ఈ ఎన్నికల ప్రక్రియలో జిల్లాలోని వివిధ మండలాల డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొని నూతన నాయకత్వానికి తమ మద్దతు ప్రకటించారు. సంఘం బలోపేతం ద్వారా ఉద్యోగుల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.