PEN POWER
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 8:51 pm Posted By : D Ratnam

పోలవరం జిల్లా సమగ్ర శిక్ష ఏపీఓగా బొజ్జియ్య బాధ్యతల స్వీకరణ

 

గంగవరం రంపచోడవరం, పెన్ పవర్, మే 23:
పోలవరం జిల్లా సమగ్ర శిక్ష అకడమిక్ ప్రోగ్రాం ఆఫీసర్ (ఏపీఓ)గా తీగల బొజ్జియ్య శనివారం బాధ్యతలు స్వీకరించారు. రంపచోడవరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏజెన్సీ డీఈఓ మల్లేశ్వరరావు సమక్షంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా బొజ్జియ్య మాట్లాడుతూ జిల్లాలో విద్యా అభివృద్ధి, సమగ్ర శిక్ష పథకాల సమర్థవంతమైన అమలు కోసం కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.రాజవొమ్మంగి జడ్పీ ఉన్నత పాఠశాలలో పీజీటీగా విధులు నిర్వహిస్తున్న బొజ్జియ్య బదిలీపై పోలవరం జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి వచ్చారు. ఆయనకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.