PEN POWER
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 5:28 pm Posted By : D Ratnam

ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధన

 

జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్

గంగవరం పెన్ పవర్

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన సాగుతుందని దీనికి నిదర్శనం ఇటీవల విడుదలైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు అని పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా బుధవారం గంగవరం మండలం కొత్తాడ నెల్లిపూడి గ్రామాల్లో జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న సుమారు 15 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా తల్లిదండ్రులను ఒప్పించారు. ఆయన వెంట గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ రుక్మండయ్య, ఎంపీడీవో లక్ష్మణరావు, ఎంఈఓ మల్లేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.