PEN POWER
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 6:01 pm Posted By : M CHANTI BABU

భూ వివాదంపై మండల స్థాయి సమన్వయ సమావేశంలో విచారణ

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మే 16:అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం దుప్పలవాడ పంచాయతీ కుమ్మరపల్లి గ్రామానికి చెందిన బైశెట్టి బాబూజీ, తరెపల్లి కోటేశ్వరరావు మధ్య కొనసాగుతున్న భూ వివాదాన్ని శనివారం నిర్వహించిన మండల స్థాయి సమన్వయ సమావేశం (ఎంఎల్‌సీసీ)లో విచారించారు. భూమిని సర్వే నిర్వహించిన అనంతరం భూ పంపకాలకు సిద్ధంగా ఉన్నామని ఇరువర్గాలు సమావేశంలో అంగీకారం తెలిపాయి. దీంతో వారం రోజుల్లో సర్వే చేపట్టి హద్దులు చూపిస్తామని తహసీల్దార్ హెచ్. అన్నాజీ రావు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సిద్ధార్థ్ మార్క్ తదితరులు పాల్గొన్నారు.