PEN POWER
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 6:10 am Posted By : Sathish Bede

మన్యం లో వరుస బైక్ చోరీలు

  • వరుస బైక్ చోరీల. ప్రజల్లో ఆందోళన

చింతూరు, పెన్, పవర్ మే 19:

ఏజెన్సీ ప్రాంతంలోని చింతూరు, కూనవరం, వీఆర్.పురం, యాటపాక మండలాల్లో వరుసగా బైక్ చోరీలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం నుంచి ప్రతి నెలా రెండు నుంచి మూడు బైకులు చోరీకి గురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. తాజాగా చింతూరు మండలంలోని నరసింహపురం గ్రామానికి చెందిన కాక సీతారామయ్యకు చెందిన AP40AN6573 నంబర్ గల ఆరెంజ్ కలర్ NS 125 బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఈ నెల 18వ తేదీన చట్టి లో అపహరించినట్లు బాధితులు తెలిపారు. దొంగలు తెల్లవారుజామున జరగడం జరుగుతుంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, ఏ సమయంలో, ఏ ప్రాంతంలో బైకులు మాయం అవుతున్నాయో అర్థం కావడం లేదు. దొంగలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా తప్పించుకుంటున్నారు అనే దానిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలి అని కోరారు. గ్రామాల్లో రాత్రి పహారా, సీసీ కెమెరాలు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి బైక్ చోరీలను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.