PEN POWER
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 3:45 pm Posted By : SIVA KUMAR LANKA

మాజీ కౌన్సిలర్ వర్రి శ్రీనివాసరావు మృతి

నర్సీపట్నం, పెన్ పవర్:

నర్సీపట్నం మున్సిపాలిటీ , జోగినాధునిపాలెంకు చెందిన మాజీ కౌన్సిలర్ వర్రి శ్రీనివాసరావు మృతి చెందారు. గత రెండు రోజులుగా ఇల్లు వదిలి వెళ్ళిన శ్రీనివాసరావు ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కోటవురట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సోమవారం ఎండపల్లి సమీపంలో ఏలేరు కాలువ వద్ద ఈయన కారు, బూట్లు అక్కడ ఉండడంతో, ఏలేరు కాలువను జల్లెడ పట్టారు. మంగళవారం మధ్యాహ్నం మృతదేహం లభ్యం కావడం, అది శ్రీనివాసరావుగా గుర్తించడం జరిగింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు. ఈ సంఘటనతో జోగినాధునిపాలెంలో విషాదచాయలు అనుముకున్నాయి.