రంపచోడవరం, పెన్ పవర్:
వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించిన సందర్భంగా పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు.ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడంతో ఆనందోత్సాహాలు వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు రంపచోడవరం కేంద్రంలో ఒకరికొకరు కేకులు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పార్టీ జెండాలతో భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించి బీజేపీకి అనుకూల నినాదాలతో మార్మోగించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తోందని, ప్రజలు బీజేపీ పాలనపై విశ్వాసం ఉంచి ఈ విజయాన్ని అందించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని 11 మండలాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు.