PEN POWER
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 6:15 pm Posted By : M CHANTI BABU

రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి:జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ

స్టాప్ రిపోర్టర్, పాడేరు  , పెన్ పవర్  ,మే9:ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ పిలుపునిచ్చారు.శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమం అనంతరం అధికారులకు, సిబ్బందికి ఆమె ప్రత్యేక సందేశం ఇచ్చారు. జిల్లాలో రక్తహీనతతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు.ప్రతి రక్తపు బొట్టు విలువైనదని, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తమ సామాజిక బాధ్యతగా రక్తదాన శిబిరాల్లో పాల్గొనాలని కోరారు. చిన్న రక్తదానం ఒకరి జీవితంలో వెలుగులు నింపుతుందని, జిల్లా యంత్రాంగం సమన్వయంతో రక్తదాన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆమె సూచించారు.