PEN POWER
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 11:32 am Posted By : D Ratnam

రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోండి’

రంపచోడవరం పెన్ పవర్

మార్చి-2026 టెన్త్ పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించే సౌకర్యం, ఆయా పాఠశాలల లాగిన్లో మే 1 నుంచి 7వ తేదీ వరకు అందుబాటులో ఉంచినట్లు ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు తెలిపారు. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఆయా పాఠశాలల లాగిన్ల ద్వారా సమర్పించాలన్నారు. మరిన్ని వివరాల కోసం www.bse.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని కోరారు.