PEN POWER
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 8:39 am Posted By : SIVA KUMAR LANKA

వైయస్ జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే గణేష్

నర్సీపట్నం, పెన్ పవర్ :

సోమవారం సాయంత్రం జిల్లా కోర్టులో సృష్టి క్షేత్రం వివాదంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ కు ముందస్తు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి, వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సృష్టి క్షేత్రం వివాదంలో కూటమి నేతల అరాచకాలను జగన్ కు వివరించారు. అన్నింటికి సమాధానం చెబుదామని, అంతవరకు ధైర్యంగా ముందడుగు వేయాలని భరోసా ఇచ్చారు.