PEN POWER
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 7:28 pm Posted By : SRIKANTH NARASIMHALA

శ్రీకాళహస్తిలో జనసేన యువనేత మండలనేని చరణ్ తేజ ప్రత్యేక పూజలు

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 10:

చిలకలూరిపేట: ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ నాయకుల సందడి నెలకొంది. నియోజకవర్గ జనసేన పార్టీ యువనేత, ప్రముఖ సేవా దృక్పథం కలిగిన ప్రదాత మండలనేని చరణ్ తేజ ఆదివారం శ్రీకాళహస్తిని సందర్శించారు. వీరితో శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మరియు ప్రముఖ దర్శకులు మెహర్ రమేష్, జనసేన ముఖ్య నేతలు కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న మండలనేని చరణ్ తేజ, నియోజకవర్గ ప్రజల క్షేమం కోరి ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. యువతను సమన్వయం చేస్తూ జనసేనాని ఆశయాలను జనంలోకి తీసుకెళ్లడంలో మండలనేని పోషిస్తున్న పాత్రను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు