PEN POWER
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 6:45 am Posted By : D Ratnam

ఎర్నగూడెం వద్ద తెల్లవారుజామున ఘోర ప్రమాదం

 

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం వద్ద విషాదం చోటుచేసుకుంది. రాజాం నుంచి విజయవాడ వెళ్తున్న హైటెక్ ఎక్స్ప్రెస్ బస్సు లారీని బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. దేవరపల్లి సీఐ నాయక్, ఎస్ఐ మనోహర్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు.