PEN POWER
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 2:16 pm Posted By : D Ratnam

గోవింద గిరి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

 

రంపచోడవరం, పెన్ పవర్, మే 23 :
“స్వామివారిపై అచంచల భక్తి, విశ్వాసంతో ప్రార్థనలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి” అన్న నమ్మకంతో శనివారం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో గోవింద గిరి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రంపచోడవరం సమీపంలోని పోలవరంలో నిర్వహించబడుతున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో శనివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే భక్తులు భారీగా ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తిశ్రద్ధలతో స్వీకరించారు.ఈ ఆలయంలో వరుసగా తొమ్మిది శనివారాలు 11 ప్రదక్షిణాలు నిర్వహిస్తే స్వామివారి కృపాకటాక్షాలు లభించి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి భావంతో ప్రదక్షిణాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం మొత్తం గోవింద నామస్మరణలతో మార్మోగింది.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మణికంఠ స్వామి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. టెంపుల్ ఇన్స్పెక్టర్  శిరీష వేసవి తీవ్రత దృష్ట్యా ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సదుపాయం, అన్నదానం కార్యక్రమాలను టెంపుల్ ఇన్స్పెక్టర్ శిరీష ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బంది స్వామివారి సేవకులు భక్తులకు అన్ని ఏర్పాట్లు  చేశారు.

అన్నదానం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు