73 వార్డ్ జీవీఎంసి ఎన్నికల ముఖ చిత్రం విశాఖపట్నం :(స్టాఫ్ రిపోర్టర్ )పెన్ పవర్ ,మే 14 మహా విశాఖ నగర పాలక సంస్థ పార్టీలు సిద్ధంగా ఉన్నాయా అంటే అనుమానమే . వార్డ్ లో ప్రధాన పార్టీ టిడిపి నిర్లక్ష దొరణీ లో వ్యవహరిస్తున్న తీరు పలువురు నాయకులను అసహనానికి గురిచేస్తుంది . ముఖ్యం గా ద్వితీయ శ్రేణి నాయకులను విస్మరిస్తున్నారని విమర్శ లేకపోలేదు. పాత గాజువాక టిడిపి కార్యాలయం లో అంతా తానే అన్నట్లు ఒక వ్యక్తి ఎమ్యెల్యే బంధువు తీరు పలువురు నాయకులు ,కార్యకర్తలు ,పార్టీ అభిమానులు ,సామాజిక వర్గం నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు . 73 వార్డ్ జీవీఎంసీ ఎన్నికల్లో బరిలో టికెట్ ఆశిస్తున్న ఆశావాదులు లిస్ట్ పెద్దదే . పోటీకై పలువురు సిద్దంగా ఉన్నారు .73 వార్డ్ టిడిపి అధ్యక్షుడు సింగూరు అనంత్ రేసు లో ప్రధమ స్థానం లో ఉన్నాడు . వార్డ్ లో నిత్యం తిరుగుతూ ప్రజా సమస్య లు అధికారుల దృష్టి కి తీసుకెళుతూ సమస్య ల పరిష్కరిస్తున్నరు . సింహగిరి కాలనీ ,పైడిమాంబ కాలనీ మంచి పట్టుఉన్న నాయకుడు టీఎన్ టి యు సి కార్యదర్శి నమ్మి సింహాద్రి కార్మిక నాయకుడు గా సూపరచితడు పార్టీ కార్యక్రమలో చురుకుగా పాలుగోంటున్నాడు . వార్డ్ లో అందరికి సూపరచితుడు . టికెట్ ఆశిస్తున్నాడు . గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నాడు .73 వార్డ్ ముఖ్య నాయకుడు యువ కెరటం బలగం బాలు నాయుడు పార్టీ టికెట్ కై ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు . వార్డ్ లో పట్టున్న నాయకుడు. గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటూ పలు సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొని వెళుతూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో ప్రజల అభిమానాన్ని చూర గొన్నాడాని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిత్యం ప్రజలతో ఉంటూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ వార్డుల్లో కలియ తిరుగుతూ వాటి పరిష్కారానికి నేనున్నానంటూ ముందుకు వస్తున్న నాయకుడిగా వార్డులో మంచి పేరు పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.73 వ వార్డులో ఒక ప్రముఖ వ్యక్తి పదేపదే పోటీ చేస్తూ ఓటమిని పొంది బంగపడుతున్న మరల రాబోవు జీవీఎంసీ ఎలక్షన్కు రెడీ అయ్యాడని 2007లో టికెట్టు ఆశించి బంగపడిన ప్రసాదుల శ్రీను తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ అభ్యర్థి అయిన పులిచెర్ల రాజేశ్వరికి ఎదురు నిలబడటం పార్టీ వ్యతిరేకతకు నిదర్శనం . 2007 ఎన్నికల ముఖచిత్రం చూస్తే తెలుగుదేశం పార్టీ తరపున పులిచర్ల రాజేశ్వరి , కాంగ్రెస్ పార్టీ తరుపున మూర్తి ,ఇండిపెండెంట్అభ్యర్ధి ఏమిలి జ్వాల , రెబల్ అభ్యర్థిగా ప్రసాద శ్రీను నిలబడిన సంగతి అందరికీ తెలిసినదే ఓడిపోతానని సమాచారం పక్కాగా ఉండడంతో లోపాయికారిగా ఇండిపెండెంట్ అభ్యర్ధి ఏమిలి జ్వాల కు మద్దతునిస్తూ ఏమిలి జ్వాల గెలుపుకు కారణయ్యాడనే అపవాదు ఉండనే ఉంది. పులిచెర్ల రాజేశ్వరిని దగ్గరుండి మరి ఓడించిన ఘనత ఈ మహానుభావుడుకే దక్కుతుంది పార్టీ అధిస్తానం గుర్రుగా ఉన్న సంఘతి అందరికీ తెలిసినదే . 2021 మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో మరల టికెట్ ఆశించి పైరవీలు చేసుకొని ఎలాగైనా మొత్తానికి 73 వ వార్డు కార్పొరేటర్ టికెట్టు తెలుగుదేశం తరఫున అభ్యర్థిగా తన భార్య అయిన ప్రసాదుల సునీత పేరు మీద తెచ్చుకోని బరిలోకి దిగడం జరిగింది. 2021 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ తరపున భూపతిరాజు సుజాత,తెలుగుదేశం పార్టీ తరఫున ప్రసాదుల సునీత, జనసేన పార్టీ తరఫున గోవింద్ నిలబడడం జరిగింది ఎన్నికల పోటీ రసవత్తరం గా ఎంత ఉన్నదో లేదో తెలియదు గాని ప్రసాదు శ్రీను సామజిక వర్గం లో తీవ్ర వ్యతిరేకత ,గతం లో పార్టీ కి చేసిన వెన్నుపోటు భారీ ఓటమికి కారణభూతం అయింది . ఓటమి పై మదనపడకుండా , ఓటమిపై అంచనా వేసుకుంటూ ఏ విధంగా ఓడిపోయామని తెలుసుకొనడానికి ప్రయత్నించలేదు సరి కదా వార్డ్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పరిమితమై పైరవీలు చేసుకుంటూ ఎవరైనా పని మీద వచ్చితే ముందు తన దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోవాలని ముఖం జారీ చేస్తూ తన తర్వాతే ఎమ్మెల్యే అన్న తరహాలో వ్యవహరించడం . 2021 ఎన్నికల్లో పరాజయానికి మూల కారణం గత అనుభవంలో 2007లో జరిగిన అపోజిషన్ పార్టీకి మద్దతు ఇచ్చి సో పార్టీ మీద రెబల్గా నిలబడటం వారు జీర్ణించుకోలేక తమ సామాజిక వర్గంలోనే కొందరు నాయకులు దగ్గరుండి మరియు ఓడించార ని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఎమ్మెల్యే కార్యక్రమాలు చూడటం ఆఫీసును మొత్తం అంతా తానే నడిపిస్తున్నాను తానే లేకపోతే పార్టీ ఆఫీసు లేదని అన్న తీరుతో చందన వ్యవహరించడంతో పలమూరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పలు కార్యక్రమాలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శాసనసభ్యుడి దగ్గరకు వెళ్లాలంటే ముందుగా ప్రసాదల శ్రీను దర్శనం చేసుకోవాలని తరహాలో తయారయింది . గతంలో ఒక సామేత చెప్పినట్టు దేవుడు వరమిచ్చిన పూజారి వరమియుడు అన్నట్టుగా అన్నట్టుగా తయారయింది తెలుగుదేశం పార్టీ గాజువాక తీరు మరల రాబోవు ఈవీఎంసీ ఎలక్షన్లలో మళ్లీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాడని బోగట . గత అనుభవాలు దృష్టిలో పెట్టుకోని పార్టీ అధిష్టానం మరలా ఈయన సపోర్ట్ చేసిన వ్యక్తికి పార్టీ టికెట్ ఇస్తే డిపాజిట్ కూడా గల్లంతైపోతుందని స్థానికులు వ్యాఖ్యనిస్తున్నారు. వార్డుల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో నిత్యం ప్రజల మధ్య తిరుగుతున్న నాయకులు టికెట్ ఇస్తే గెలుస్తారని ఉదాహరణకు సింగురు ఆనంత్ , నమ్మి సింహాద్రి, బలగం బాలు నాయుడు తో పార్టీ ముందుకు దూసుకెళ్తూ తమ లక్ష్యానికి చేరుకుంటున్నారని పార్టీకి మంచి భవిష్యత్తు రావాలన్న యువత రంగాన్ని తీసుకురావాలని పలువురు రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. నిభందనులు ప్రకారం పార్టీ లోని వ్యక్తులకు నామినటేడ్ పదవి ఒక్క డని కె అర్హుడు కానీ విచిత్రం మన ప్రసాదులు కు గాజువాక తెలుగుదేశం పార్టీ సమన్వయ కర్త , సివిల్ సప్లయ్ బోర్డ్ డైరెక్టర్ రెండు పదవులు వెలగబెడుతున్నాడు . వడ్డించిన వాడు మన వాడు అయితే చివరి బంతి అయిన పరవాలేదు అన్న చందాన ఉంది మన ప్రసాదుల తీరు . పలు ఆరోపణలు,విమర్శలు ఉన్నా ఎమ్యెల్యే దగ్గర బంధువు కావడంతో పార్టీ చర్యలు తీసుకోవడాని వెనుకడుతుంది అనే విమర్శ లేకపోలేదు.