PEN POWER
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 7:54 pm Posted By : M CHANTI BABU

90% రాయితీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ

గూడెం కొత్తవీధి మండలం రింతాడ రైతు సేవా కేంద్రంలో రైతులకు 90 శాతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు. ఉప వ్యవసాయ సంచాలకులు వై.వి. రమణరావు మాట్లాడుతూ పచ్చిరొట్ట విత్తనాలు భూసారం పెంచి పంట దిగుబడులను మెరుగుపరుస్తాయని తెలిపారు. రైతులు తప్పనిసరిగా రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.సహాయ వ్యవసాయ సంచాలకులు బి.వి. తిరుమలరావు మాట్లాడుతూ గంజాయి పంటకు బదులుగా కూరగాయల సాగును క్లస్టర్ విధానంలో చేపట్టాలని కోరారు. రైతులకు విత్తనాలతో పాటు అవకాడో, లిచి మొక్కలను కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు మధు,గిరిబాబు నాయకులు శరబన్న దొర, సోమేశ్ కుమార్ రైతులు పాల్గొన్నారు.