పెన్ పవర్ ప్రత్యేక కథనం – ఎపిసోడ్ 3
తాడేపల్లిగూడెంలో ఫిర్యాదుల ఫిక్సింగ్ నెట్‌వర్క్..?
డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు ఇస్తే… ముందుగా అప్పూ చేతుల్లోకేనా..?
డీఎస్పీని కలిసేలోపే కంప్లైంట్ కథను మార్చేస్తున్నది ఎవరు..?
బాధితుడు బయటకు వెళ్లగానే బాదంపప్పుకు వెళ్లే సీక్రెట్ కాల్స్ ఏంటి..?
‘ఇంకో రెండు ఎక్స్‌ట్రా’ అంటూ మొదలయ్యే కొత్త సెటిల్మెంట్ ఫార్ములా..?
విశాఖలో విల్లా కలలు… అప్పూ ఆస్తులపై కొత్త చర్చ..!
పప్పు–అప్పూ గేమ్‌పై పోలీస్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..?
పోలీస్ స్టేషన్‌లో ఒకరు… డీఎస్పీ కార్యాలయంలో మరొకరు… ఇద్దరి మధ్య సమన్వయం ఉంటే సామాన్య బాధితుడి పరిస్థితి ఎలా ఉంటుందో తాడేపల్లిగూడెంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫీల్డ్‌లో వ్యవహారాలు నడిపించే “బాదంపప్పు”… డీఎస్పీ ఆఫీస్‌లో ఫిర్యాదుల ప్రవాహాన్ని కంట్రోల్ చేసే “అప్పూ”… ఈ ఇద్దరి పేర్లు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. బాధితులు చెబుతున్న వర్షన్ ఆధారంగా పెన్ పవర్ పరిశీలనలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఎడిటర్, పెన్ పవర్ భీమవరం/ తాడేపల్లిగూడెం, మే 16:

ఉదయం 10 గంటలు… డీఎస్పీ కార్యాలయంలో అసలు సీన్ ఇదేనా..? ఒక బాధితుడు చేతిలో ఫిర్యాదు పత్రం పట్టుకుని డీఎస్పీ కార్యాలయానికి చేరుకుంటాడు.
“సార్… ఫలానా ఎస్సై మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు… డీఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు ఇవ్వాలి…” అని చెప్పగానే… అక్కడే ఉన్న అప్పూ రంగంలోకి దిగుతాడని సమాచారం. “డీఎస్పీ గారు లేరు… మీ కంప్లైంట్ నాకు ఇవ్వండి… రాగానే పెడతాను… మీకు నేను ఫోన్ చేస్తాను…” అంటూ నమ్మకం కలిగిస్తాడని బాధితులు చెబుతున్నట్టు సమాచారం. అమాయక ప్రజలు కూడా నమ్మి ఫిర్యాదు పత్రాన్ని అప్పగించి వెనుదిరుగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డీఎస్పీ ఉన్నా… వ్యవహారం అప్పూ చేతుల్లోనేనా..?
కొన్ని సందర్భాల్లో డీఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారి ఉన్నప్పటికీ… ముందుగా అప్పూ వెళ్లి పరిస్థితిని వివరించేస్తాడని ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు ఏం చెబుతాడు…? ఎలా స్పందించాలి…? ఎంత వరకు వినాలి…? అన్న అంశాలపై ముందుగానే “ఫీడ్” ఇస్తాడన్న ప్రచారం స్థానికంగా వినిపిస్తోంది.
ఏళ్ల తరబడి ఒకేచోటే డ్యూటీ… అందుకేనా అండదండలు..?
తాడేపల్లిగూడెంలో సంవత్సరాలుగా పాతుకుపోయిన కొందరు పోలీసు సిబ్బందిని… ఒకసారి స్పెషల్ బ్రాంచ్‌లోకి, మరోసారి ఇంటెలిజెన్స్ విభాగాల్లోకి తీసుకోవడం వల్ల… తాడేపల్లిగూడెంలో జరిగే అనేక వ్యవహారాలు ఇంతకముందు ఇక్కడే డిపార్ట్మెంట్ లో పనిచేసి ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిగా.. ఇంటిలిజెన్స్ సిబ్బందిగా… ఉన్నవారికి సుపరిచితమేనని, ప్రస్తుతం తాడేపల్లిగూడెం డిపార్ట్మెంట్ లో జరిగే వ్యవహారాలు పైస్థాయి అధికారుల దృష్టికి పూర్తిగా వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికంగా బలమైన నెట్‌వర్క్ ఏర్పరుచుకున్న ఈ వర్గం… స్టేషన్ల స్థాయిలో జరిగే వ్యవహారాలను తమకు అనుకూలంగా మలుచుకుంటోందన్న చర్చ నడుస్తోంది. ఇంకా షాకింగ్ అంశం ఏమిటంటే… తాడేపల్లిగూడెంలో ఏ రైడింగ్ జరిగిన ఈ రెండు శాఖలకు చెందిన సిబ్బందికి కొంత మొత్తం వెళుతుందని విశ్వాస సమాచారం… ఇలా గూడెం లో ఉన్న స్టేషన్ల నుంచి నెలవారీ మామూల్లు కూడా అందుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం బయటకు వస్తోంది. అందుకే “ఫిర్యాదులు పైకి వెళ్లకుండా ఫిల్టర్ అవుతున్నాయాని..? పై అధికారులకు చేరకుండా మధ్యలోనే కథ ముగుస్తుందన్న ప్రశ్నలు ఇప్పుడు తాడేపల్లిగూడెంలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇక మన పప్పూ దగ్గరికి వస్తే… బాధితులు బయటకు వెళ్లగానే… బాదం పప్పుకు కాల్..?
ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి వెళ్లిపోయిన వెంటనే… అప్పూ నుంచి ఫీల్డ్‌లో ఉన్న బాదం పప్పుకు సమాచారం వెళ్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. “వాళ్లు ఇక్కడికి వచ్చారు…” “ఏం కంప్లైంట్ ఇచ్చారు…” “ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో చూడు…” అంటూ సంభాషణలు జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది.
ఇంకో రెండు ఎక్స్‌ట్రా’ ఫార్ములా..?
ఇప్పటికే సమస్యతో ఇబ్బంది పడుతున్న బాధితుడికి… “ఇంకో రెండు పెంచండి…” “అప్పుడే విషయం సెటిల్ అవుతుంది…” అంటూ అదనపు డిమాండ్లు వస్తున్నాయన్న ఆరోపణలు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారాయి. బాధితుడి కథ అక్కడే మొదలు ఒకసారి ఈ వలయంలో చిక్కుకున్న తర్వాత… ఎప్పుడు సమస్య ముగుస్తుందో తెలియదు ఎంత ఖర్చవుతుందో తెలియదు ఎవరిని కలవాలో అర్థం కాదు చివరికి బాధితుడు పూర్తిగా మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.
విశాఖలో విల్లా కలలు..? గూడెం లో బడా ఫ్లాట్..?
ఈ వ్యవహారాల ద్వారా వచ్చిన డబ్బుతో… అప్పూ తన అత్తగారి ప్రాంతమైన విశాఖలో ఓ బారీ గృహ నిర్మాణం కు ప్లాన్ చేశాడని… అక్కడ ప్రస్తుతం పనులు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం స్థానికంగా చర్చకు దారి తీస్తోంది.? అలాగే తాడేపల్లి గూడెం లో సుమారు 50 లక్షలు విలువ చేసే టూ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం..? పై రెండు నిర్మాణాలు ఒక కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగి చేయగలడా… అంటే అది సాధారణ కానిస్టేబుల్ లకు… మాత్రం జీవితం మొత్తం ఉద్యోగం చేసిన ఒక నిర్మాణం కూడా చేసుకోలేరు… కానీ మన అప్పు మాత్రం అలగ్… ప్రస్తుతం
అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి స్పందన రావాల్సి ఉంది.
పోలీస్ బాస్ ల స్పందన ఏంటి..?
ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు ఇప్పటికే సమాచారం సేకరిస్తున్నారా..? అప్పూ పాత్రపై ఎలాంటి చర్యలు ఉంటాయి..? అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. పెన్ పవర్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో… ఈ “బాదం పప్పు – అప్పూ” వ్యవస్థ వెనుక రాజకీయ లింకులు ఎవరు..? ఎవరు రక్షణ కవచంగా ఉన్నారు..?
మరిన్ని సంచలన విషయాలతో ఎపిసోడ్ – 4 త్వరలో…