PEN POWER
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 10:19 pm Posted By : PEN POWER TELANGANA

కొరడా ఝళిపించిన ‘సిఎంసి’.. కమర్షియల్ కాంప్లెక్స్ సీజ్..

రెసిడెన్షియల్ అనుమతులతో.. కమర్షియల్ కాంప్లెక్స్‌ నిర్మాణం..

వెలుగులోకి తెచ్చిన ‘పెన్ పవర్‌’ రంగంలోకి ‘సిఎంసి’ అధికారులు.. బిల్డింగ్ సీజ్.. పనుల నిలిపివేత..

నిజాంపేట్ ‘సిఎంసి’ చర్యలను ‘అపహాస్యం’ చేసిన అక్రమ నిర్మాణ దారుడు..

విషయాన్ని అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏసిపి) దృష్టికి తీసుకెళ్ళిన ‘పెన్ పవర్’ ప్రతినిధి..

వెంటనే స్పందించిన ఏసిపి ప్రసీదా.. చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు..

మరోవైపు సోమవారం ‘సీల్ వేసిందెవరు..? తొలగించిందెవరు..? ప్రత్యేక కథనం..!

‘పెన్ పవర్’ వార్తా కథనానికి స్పందించి.. రెండవసారి సీజ్ చేసిన టౌన్‌ప్లానింగ్..

దుండిగల్‌, పెన్ పవర్, మే 4:

నిజాంపేట్ సర్కిల్-58 సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ‘పెన్ పవర్’ దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించి రెండవసారి సీల్ వేశారు.. గతంలో రెసిడెన్షియల్ అనుమతులతో నిర్మించిన, ఇదే కమర్షియల్ నిర్మాణాన్ని, నిజాంపేట్ సర్కిల్ సిఎంసి టౌన్‌ప్లానింగ్ అధికారులు సీజ్ చేసినప్పటికీ..! అక్రమ నిర్మాణ దారుడు, బరితెగించి, సీల్ వేసిన ఈ అక్రమ నిర్మాణంలో, చట్టవ్యతిరేకంగా, దర్జాగా పనులు కొనసాగించడం గమనార్హం.. సీజ్ చేసిన ఆనవాళ్ళు కూడా ఆ భవనంపై కనిపించక పోవడం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని సోమవారం “సీల్ వేసిందెవరు..? తొలగించిందెవరు..? అన్న శీర్షికతో వార్తను ప్రచురించడంతో నిజాంపేట్ సర్కిల్-58 టౌన్‌ప్లానింగ్ ఏసిపి ప్రసీదా తీవ్రంగా స్పందించారు.. టిజి-బిపాస్ బిల్డ్‌నవ్ చట్టాన్ని, నిబంధనలను ఉల్లంఘన కింద సంబంధిత సిఎంసి అధికారులు సోమవారం కొరడా ఝుళిపించారు.. రెండవ సారి కమర్షియల్ భవనానికి ‘సీల్’ వేయడం తోపాటు, భవనం పైకి వెళ్ళే మార్గానికి కూడా, తాళం వేసి సీల్ ముద్ర వేశారు..

సీల్ వేసిందెక్కడ..? ఎందుకు..?

 సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిజాంపేట్ సర్కిల్-58 పరిధిలోని బాచుపల్లి నుండి గండిమైసమ్మ వెళ్ళేదారిలో, 200 ఫీట్ల రహదారిపై ఓ వ్యక్తి “స్టిల్ట్‌(పార్కింగ్) 3 అంతస్తులకు ‘ఇంటి’ అనుమతులు తీసుకున్నాడు.. నిర్మాణం దాదాపు సెటిల్మెంట్‌లు మినహాయించి నిర్మాణం పర్మిషన్ ప్రకారమే పూర్తయింది.. అయితే ఇంతవరకు రెసిడెన్షియల్ నిర్మాణంగానే ఉన్నప్పటికీ..! ఇక్కడి నుంచి కమర్షియల్ కార్యకలాపాలకు ‘అద్దాలమేడ’గా తీర్చిదిద్దాడు.. దీంతో నిజాంపేట్ సర్కిల్ అధికారులు వెంటనే సీల్ వేసి బ్యానర్ కట్టారు.. ఓవైపు తనకున్న పలుకుబడి ఉందన్న ఆరోపణలు..! మరోవైపు ఓ మహత్తరమైన పథకం పన్నాడు.. సంబంధిత భవనాన్ని రెసిడెన్షియల్ కోసమే వినియోగిస్తానని కట్టుకథలు చెప్పి అధికారుల చేతనే, సీల్ తొలగించినట్టు సమాచారం.. వెంటనే తన వక్రబుద్దిని బయటపెట్టి మళ్ళీ కమర్షియల్ కాంప్లెక్స్‌గా మార్చేందుకు శరవేగంగా పనులు జరుగుతుండగా, సోమవారం ‘పెన్ పవర్’ దినపత్రికలో వచ్చిన “సీల్ వేసిందెవరు..? తొలగించిందెవరు”..? అన్న వార్తా కథనానికి, నిజాంపేట్ సర్కిల్-58 సిఎంసి టౌన్‌ప్లానింగ్ అధికారులు స్పందించి రెండవ సారి సీల్ వేశారు..