“షాడో ఎమ్మెల్యే” ఆరోపణలపై మళ్లీ చర్చలో మాజీ ఏఎంసీ
- అక్రమ లేఔట్లపై అధికారుల దృష్టి
- గ్రావెల్, ఇసుక వ్యవహారాలపై మళ్లీ చర్చ
- విజిలెన్స్‌కు బాధితుల ఫిర్యాదుల ప్రచారం
- “షాడో ఎమ్మెల్యే” వ్యాఖ్యలతో రాజకీయ వేడి
- కావలి రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న విచారణలు
గత వైసీపీ హయాంలో కావలి ప్రాంతంలో అక్రమ లేఔట్లపై విచారణ జరుగుతోందని సమాచారం గత ప్రభుత్వ హయాంలో భూవివాదాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ప్రభుత్వ భూముల వినియోగంపై అధికారుల దృష్టి గ్రావెల్ మరియు ఇసుక తరలింపులపై స్థానిక స్థాయిలో చర్చ కొంతమంది బాధితులు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించినట్లు ప్రచారం రాజకీయ ప్రభావం వినియోగంపై ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అధికారిక నిర్ధారణ కోసం ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది
పెన్ పవర్ ప్రత్యేక కథనం, కావలి మే 10:
కావలి నియోజకవర్గ రాజకీయాల్లో మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నె మాల సుకుమార్ రెడ్డి పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన భూవివాదాలు, అక్రమ లేఔట్లు, గ్రావెల్ తరలింపులు, సెటిల్మెంట్లు వంటి అంశాలపై ప్రస్తుతం అధికార యంత్రాంగం దృష్టి సారించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ భూముల వినియోగం, అనుమతుల్లేని లేఔట్లు, రాజకీయ ప్రభావం వినియోగం వంటి అంశాలపై విచారణ కొనసాగుతోందని సమాచారం.
స్థానిక వర్గాల కథనాల ప్రకారం, 2019 నుంచి 2024 మధ్య కాలంలో కావలి నియోజకవర్గంలో పలువురు నేతలు, అధికారులు, బాధితులు ఒత్తిళ్లు ఎదుర్కొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. సంబంధిత అధికారులు విచారణ అనంతరం మాత్రమే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అక్రమ లేఔట్లు, భూకబ్జాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో కావలి పరిసర ప్రాంతాల్లో కూడా పలు ఫైళ్లను తిరిగి పరిశీలిస్తున్నట్లు సమాచారం. కొంతమంది బాధితులు విజిలెన్స్ మరియు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
ఇక సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో “షాడో ఎమ్మెల్యే”గా ప్రచారంలో ఉన్న ఈ నాయకుడిపై త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా, అధికారిక ప్రకటన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.