PEN POWER
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 4:48 pm Posted By : starsrinu1899@gmail.com

అడ్డతీగల తహసిల్దార్ గా కె. తేజస్విని..

అడ్డతీగల, పెన్ పవర్, జూన్ 05: అడ్డతీగల తాసిల్దార్ గా కె. తేజస్విని శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు గంగవరం మండల డిప్యూటీ తాసిల్దార్ గా బాధ్యతలు నిర్వహిస్తూ, పదోన్నతి పై అడ్డతీగల తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన డిప్యూటీ తాసిల్దార్ దొరకయ్య నూతన తాసిల్దార్ తేజస్వినికి శుక్రవారం బాధ్యతలు అప్పగించారు. దొరకయ్య యధావిధిగా డిప్యూటీ తాసిల్దార్ బాధ్యతను నిర్వహిస్తున్నారు. తాసిల్దార్ తేజస్విని మాట్లాడుతూ గతంలో డిప్యూటీ తాసిల్దార్ గా అడ్డతీగల మండలంలో బాధ్యతలు నిర్వహించిన అనుభవం తనకున్నదని, తాసిల్దార్ ఆఫీసుకు ప్రజలు వచ్చినప్పుడు తనను నేరుగా సంప్రదించవచ్చని వారికి ఉన్నటువంటి ఇబ్బందులను తనకు నేరుగా తెలియజేయవచ్చని తేజస్విని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన తాసిల్దార్ కే. తేజస్వినికి సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.