PEN POWER
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 2:25 pm Posted By : D Ratnam

ఆర్యవైశ్య మహాసభ వాణిజ్య విభాగం వైస్ చైర్మన్‌గా నల్లమిల్లి సుబ్బారావు

విజయవాడ, పెన్ పవర్, జూన్ 18: ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ వాణిజ్య విభాగం వైస్ చైర్మన్‌గా నల్లమిల్లి సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఇల్లూరి లక్ష్మయ్య మాట్లాడుతూ, నల్లమిల్లి సుబ్బారావుకు పలు రాష్ట్రాల్లో వివిధ వ్యాపార రంగాల్లో విశేష అనుభవం ఉందని తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, సేవాభావం, అనుభవం సంస్థ బలోపేతానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి , , వాసవి సన్నిధి చైర్మన్ , మార్కాపురం వీవీకే తదితరులు పాల్గొని నల్లమిల్లి సుబ్బారావును అభినందించారు.మహాసభ గౌరవాధ్యక్షుడు మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మహాసభ అభివృద్ధి కోసం మరింత కృషి చేయాలని సూచించారు. పెద్దల సలహాలు, సూచనలను పాటిస్తూ సంస్థను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని నల్లమిల్లి సుబ్బారావుకు సూచించారు.