పాల్గొన్న కలెక్టర్ విజయ్ కృష్ణన్
నర్సీపట్నం, పెన్ పవర్ :
గొలుగొండ మండలం కృష్ణదేవిపేట, అల్లూరి సీతారామరాజు ఉద్యానవనంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణతో పాటు నాలుగు మండలాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులు, జనసేన పార్టీ నాయకుడు సూర్యచంద్ర మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను భాగంగా చేసుకోవాలని, యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది యోగా సాధనలో పాల్గొన్నారు. అనంతరం పాల్గొన్న అందరికీ ఐసీడీఎస్ సిబ్బంది రాగి సంకటి జావా అందజేశారు. యోగా దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి.