గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, జూన్ 3
చింతూరు మండలం తులసిపాక సమీపంలో బుధవారం రాజమహేంద్రవరం నుంచి చింతూరు వెళ్తున్న గూడ్స్ లారీ (CG 18S 8034) ప్రమాదవశాత్తు దగ్ధమైంది. లారీ వెనుక టైర్ల నుంచి పుట్టిన నిప్పురవ్వలు క్రమంగా మంటలుగా మారి వాహనాన్ని పూర్తిగా దహనం చేశాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి వివరాల కోసం విచారణ చేపడుతున్నారు.