PEN POWER
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 7:22 pm Posted By : M CHANTI BABU

జీ.కే.వీధి-1 వీఆర్వో వసుపరి లింగాలు మృతి

రెవెన్యూ శాఖలో విషాదం.. తహసీల్దార్, ఉద్యోగుల సంతాపం

గూడెంకొత్తవీధి,పెన్ పవర్,జూన్ 23:మండలంలో జీ.కే.వీధి-1 వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న వసుపరి లింగాలు మంగళవారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.వసుపరి లింగాలు మరణవార్త తెలుసుకున్న రెవెన్యూ శాఖ అధికారులు, సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన సేవలను స్మరించుకుంటూ పలువురు సంతాపం వ్యక్తం చేశారు.కాగా, వసుపరి లింగాలు అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.