PEN POWER
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 10:05 pm Posted By : SIVA KUMAR LANKA

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి రూ.10 వేల చొప్పున జరిమానా

నర్సీపట్నం, పెన్ పవర్:

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజూ ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పట్టణ సీఐ గఫూర్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై ఈ-చలాన్లు విధించడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను నర్సీపట్నంలోని అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, సోమవారం న్యాయస్థానం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు వెల్లడించారు. ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా వాహన తనిఖీలు, ఈ-చలాన్ల జారీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సీఐ గఫూర్ హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, మద్యం సేవించి వాహనాలు నడపకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు.