PEN POWER
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 4:16 pm Posted By : M CHANTI BABU

రైతులకు పెదవలస రైతు సేవా కేంద్రంలో విత్తనాల పంపిణీ

ఏఎస్ఆర్ జిల్లా జీకే వీధి మండలం పెదవలస రైతు సేవా కేంద్రంలో రైతులకు విత్తనాల పంపిణీ నిర్వహించారు. వైస్ ఎంపీపీ సప్పగడ్డ ఆనంద్ చేతుల మీదుగా రైతులకు విత్తనాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రైతులు నాణ్యమైన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పథకాలు,సబ్సిడీ సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వీరోజి త్రిమూర్తులు, పేసా కార్యదర్శి దొరబాబు, అగ్రికల్చర్ అసిస్టెంట్ కోరబు నాగశంకర్ పాల్గొన్నారు. అనంతరం రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.