PEN POWER
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 9:39 pm Posted By : SIVA KUMAR LANKA

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై స్పీకర్ దిగ్భ్రాంతి

నర్సీపట్నం, పెన్ పవర్ :

​విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదం పట్ల ఎపి స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ లో లిక్విడ్ ఉక్కు కార్మికుల మీద పడటంతో జరిగిన ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటం పట్ల స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను కోరారు. అలాగే వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.