PEN POWER
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 8:41 pm Posted By : SIVA KUMAR LANKA

స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి

మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్

నర్సీపట్నం, పెన్ పవర్ :

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సోమవారం జరిగిన ప్రమాదంపై లోతైన విచారణ జరిపించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. అనకాపల్లిజిల్లా నర్సీపట్నంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఘోర దుర్ఘటన జరిగి 8 మంది సంఘటన స్థలంలోనే మరణించారని, మరికొందరు క్షతగాత్రులు అయ్యారని ఇప్పుడే సమాచారం వచ్చిందని, ఇటువంటి సంఘటనలు బాధాకరమన్నారు. గత రెండు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేయడానికి, ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం ఆలోచనతో ఉందన్నారు. ఈ మధ్యకాలంలోనే ఇటువంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి , దీనికి కారకులు ఎవరు? అనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబాలకు ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ , పార్టీ నాయకులు పాల్గొన్నారు.