SIR ప్రక్రియ పర్యవేక్షణకు జిల్లా పరిశీలకుల నియామకం
28 మంది ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగింత
అమరావతి, పెన్ పవర్, జూన్ 20: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 28 మంది ఐఏఎస్ అధికారులను జిల్లా పరిశీలకులుగా నియమించింది. ఆయా జిల్లాల్లో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పారదర్శకంగా, నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం జరిగేలా పర్యవేక్షించే బాధ్యతలను వారికి అప్పగించింది.
ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం గుంటూరు జిల్లాకు ఎం.ఎం. నాయక్, కృష్ణా జిల్లాకు సీహెచ్. శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లాకు ఎంవీ శేషగిరిబాబు, బాపట్ల జిల్లాకు కె. కన్నబాబు, పల్నాడు జిల్లాకు ముత్యాలరాజు, ప్రకాశం జిల్లాకు ఎ. సూర్యకుమారి, నెల్లూరు జిల్లాకు జి. రేఖారాణి పరిశీలకులుగా నియమితులయ్యారు.
అలాగే తిరుపతి జిల్లాకు గంధం చంద్రుడు, అన్నమయ్య జిల్లాకు కేవీఎన్ చక్రధర్ బాబు, చిత్తూరు జిల్లాకు డాక్టర్ ఎ. మల్లికార్జున, పోలవరం జిల్లాకు వి. ప్రసన్న వెంకటేశ్, మార్కాపురం జిల్లాకు పట్టన్ శెట్టి రవిసుభాష్, ఏలూరు జిల్లాకు లోతేటి శివశంకర్, పశ్చిమగోదావరి జిల్లాకు ఎం. వేణుగోపాలరెడ్డి, కాకినాడ జిల్లాకు ఎస్. దిల్లీరావు, తూర్పుగోదావరి జిల్లాకు డా. కె. మాధవీలతలను నియమించారు.
అనంతపురం జిల్లాకు జి. క్రిస్ట్ కిషోర్, అనకాపల్లి జిల్లాకు ఎం. గౌతమి, నంద్యాల జిల్లాకు పి. ప్రశాంతి, శ్రీ సత్యసాయి జిల్లాకు డా. కె. శ్రీనివాసులు, కర్నూలు జిల్లాకు బి. లావణ్యవేణి, విశాఖపట్నం జిల్లాకు ఎస్. భార్గవి, పార్వతీపురం మన్యం జిల్లాకు జె. వెంకటమురళి, వైఎస్సార్ కడప జిల్లాకు టీఎస్ చేతన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు బి. నవ్య, శ్రీకాకుళం జిల్లాకు రోణంకి కూర్మనాథ్, విజయనగరం జిల్లాకు రోణంకి గోపాలకృష్ణ, అల్లూరి సీతారామరాజు జిల్లాకు సీవీ ప్రవీణ్ ఆదిత్యలను పరిశీలకులుగా నియమించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, ఎటువంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆయా అధికారులను ఆదేశించింది.