PEN POWER
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 5:40 pm Posted By : D Ratnam

మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన

 

 

గంగవరం, పెన్ పవర్ జూన్ 23: మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, డ్రగ్స్ నిర్మూలనపై గంగవరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌డీపీఎస్ సెల్ ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు, సీసీఎస్ ఎస్సై ఈ. నరసింహమూర్తి మాట్లాడుతూ మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గంజాయి సంబంధిత ఫిర్యాదులకు 1972, సైబర్ నేరాల కోసం 1930 టోల్ ఫ్రీ నంబర్లను వినియోగించాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని ఎస్సై వెంకయ్య సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ వీర్రాజు, హెచ్‌సీలు పుండరీనాధ్, ఇజ్రాయెల్ రాజ్, కొండబాబు తదితరులు పాల్గొన్నారు.