గంగవరం, పెన్ పవర్, జూన్ 23: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం నెల్లిపూడి గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ నారా భువనేశ్వరి ఆదేశాల మేరకు ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.నెల్లిపూడిలో నిర్వహించిన శిబిరంలో మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ ఆధ్వర్యంలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దుమ్ముల రాంబాబు, చిర్రా జాషువా, గొల్లపల్లి స్వర్ణ, డాక్టర్ నిఖిత్, జీఎన్ఎం చిట్టీ, ఫార్మసిస్ట్ స్వర్ణ, ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది నాని, ఏఎన్ఎం పొట్టమ్మ, ఆశా కార్యకర్తలు వీరమణి, తబితా తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు.