రంపచోడవరం, జూన్ 25: పోలవరం జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అభివృద్ధి కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. అన్ని సీట్లను భర్తీ చేయడం, నిబంధనల ప్రకారం మెనూ అమలు, పారిశుధ్య నిర్వహణ, విద్యా సామగ్రి సకాలంలో అందజేయడం, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి తరగతి గదులు, హాస్టల్ సదుపాయాలను పరిశీలించారు.